BRS: రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన బండి సంజయ్

Bandi Sanjay and Padi Kaushik Reddy Carried Close Aide Coffin
  • గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ నాయకుడు మహేందర్‌రెడ్డి
  • అంత్యక్రియలకు వేర్వేరుగా హాజరైన బండి, కౌశిక్‌రెడ్డి
  • బీఆర్ఎస్‌లో చేరకముందు 20 ఏళ్లపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేసిన మహేందర్‌రెడ్డి
అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు. హుజూరాబాద్‌లో జరిగిందీ ఘటన. గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్‌రెడ్డి అంత్యక్రియలు నిన్న నిర్వహించారు. 

బీఆర్ఎస్‌లో చేరకముందు ఆయన రెండు దశాబ్దాలపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేశారు. బండి సంజయ్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2021లో హుజారాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కౌశిక్‌రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది. నిన్న ఆయన అంత్యక్రియలకు సంజయ్, కౌశిక్ వేర్వేరుగా హాజరైనప్పటికీ ఇద్దరూ కలిసి పాడెమోశారు.
BRS
Bandi Sanjay
Kaushik Reddy
Huzurabad
BJP

More Telugu News