YS Sharmila: ఇడుపులపాయ భూములు కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన షర్మిల

YS Sharmila registered her lands on sons name
  • వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్
  • 9.53 ఎకరాల భూమి కొడుకు పేర రిజిస్ట్రేషన్ చేయించిన షర్మిల
  • కూతురు పేరిట 2.12 ఎకరాలు రిజిస్ట్రేషన్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుండి ఇడుపులపాయ వచ్చారు. కడప విమానాశ్రయం నుండి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తన తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు.

ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వారి కుటుంబం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుంది. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు.
YS Sharmila
YSRTP
Andhra Pradesh

More Telugu News