YS Jagan: రేపు జగన్, షర్మిల వేర్వేరుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు!

YS Jagan and Sharmila pay tributes to YSR on his birth anniversary
  • ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల
  • ఉదయం తల్లితో కలిసి వైఎస్ ఘాట్ వద్ద నివాళులు
  • మధ్యాహ్నం గం.1.55కు వైఎస్ ఘాట్ వద్దకు రానున్న జగన్
రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించనున్నారు. జులై 8న వైఎస్ జయంతి. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు జగన్, షర్మిల వేర్వేరు సమయాల్లో రానున్నారు. వీరిద్దరి పర్యటన వివరాలు వెల్లయ్యాయి. షర్మిల ఇప్పటికే ఇడుపులపాయ చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి, మరుసటిరోజు తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

జగన్ మధ్యాహ్నం గం.1.55 సమయానికి ఇడుపులపాయకు చేరుకొని నివాళులర్పిస్తారు. ప్రతి సంవత్సరం వీరిద్దరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం వేర్వేరు సమయాల్లో హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా, షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఈ ప్రచారానికి ఇడుపులపాయ సాక్షిగా ఆమె తెరదించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
YS Jagan
YS Sharmila

More Telugu News