Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్

Tollywood senior actor Naresh request for licensed revolver
  • నిన్న పుట్టపర్తిలో సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసిన నరేశ్
  • 2008లో తనకు లైసెన్స్ తుపాకి ఉండేదన్న నటుడు
  • లైసెన్స్ తుపాకిని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి కోరిన నరేశ్
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న సినీ నటుడు సీనియర్ నరేశ్ తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని  కోరారు. 

నిన్న పుట్టపర్తిలో ఎస్పీని కలిసిన ఆయన మావోయిస్టుల నుంచి తనకు ప్రాణహాని ఉండడంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నట్టు తెలిపారు. మళ్లీ దానికి అనుమతి ఇవ్వాలని గతంలో కోరినా ఇవ్వలేదని, ఇప్పుడు హిందూపురంలో ఉంటున్న తనకు లైసెన్స్ రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన అభ్యర్థనకు ఎస్పీ సానుకూలంగా స్పందించినట్టు నరేశ్ తెలిపారు.
Naresh
Tollywood
Hindupur
Revolver

More Telugu News