Adipurush: కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ‘ఆదిపురుష్’ హనుమాన్

 Adipurush Fame Hanuman Vikram Mastal Joins Congress
  • ఆదిపురుష్ లో హనుమంతుడి పాత్రలో మెప్పించిన విక్రమ్ మస్తాల్
  • తన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్
  • మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

రెబల్ స్టార్ ప్రభాస్, కృతీ సనన్ జంటగా రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. చిత్రంలో పలు పాత్రలు, సన్నివేశాలపై ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే, సినిమాలో హనుమంతుడి పాత్ర పోషించిన విక్రమ్ మస్తాల్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. మంచి ఎత్తు, శరీరం ఉన్న మస్తాల్ ఈ పాత్రకు బాగా న్యాయం చేశారు. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన విక్రమ్ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ఆదిపురుష్ తర్వాత ఆయనకు ఫాలోయింగ్ పెరిగింది. 

ఈ క్రమంలో విక్రమ్ మస్తాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్ కి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్, ఎంపీ నకుల్నాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. తమ రాష్ట్రంలో మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ లో చేరినట్టు విక్రమ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News