ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదోసారి ట్రోఫీ గెలిచిన భారత్
- శాఫ్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ లో విజేతగా టీమిండియా
- ఫైనల్లో కువైట్ పై ఉత్కంఠ విజయం
- పెనాల్టీ షూటౌట్ లో సత్తా చాటిన గోల్ కీపర్ గుర్ ప్రీత్
దాంతో, విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులోనూ పోరు హోరాహోరీగా సాగింది. ఐదు ప్రయత్నాల్లో భారత్, కువైట్ నాలుగు గోల్స్ చేయడంతో స్కోరు 4–4తో సమమైంది. దాంతో నిబంధనల ప్రకారం సడెన్ డెత్ నిర్వహించారు. ఇరు జట్లకు ఒక్కో పెనాల్టీ ఇచ్చారు. ఇందులో భారత ఆటగాడు మహేశ్ సింగ్ గోల్ కొట్టగా.. కువైట్ కెప్టెన్ ఖలెద్ షాట్‌ను భారత గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ అద్భుతంగా అడ్డుకొని జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత్ తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంది.