Vijayashanti: మరింత మంచి బాధ్యతను బండి సంజయ్ కి అప్పగిస్తారని భావిస్తున్నాను: విజయశాంతి

Vijayashanti opines on Bandi Sanjay omission as Telangana BJP chief
  • తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు
  • బండి సంజయ్ ని తప్పించిన బీజేపీ పెద్దలు
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ బాధ్యతలు
  • బండి సంజయ్ మార్పు బాధాకరమన్న విజయశాంతి
తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తప్పిస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా, అది ఇవాళ నిజమైంది. బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ హైకమాండ్ ప్రకటన చేసింది. దీనిపై తెలంగాణ బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పందించారు.

తెలంగాణలో బీజేపీకి నిప్పులు పుట్టించే నడకలు నేర్పిన నేత బండి సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ ని మార్చడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే, ఆయనకు పార్టీ మరింత మంచి బాధ్యతను అప్పగిస్తుందని భావిస్తున్నానని విజయశాంతి తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల మనోభావాలను బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇక, బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు విజయశాంతి ట్వీట్ చేశారు.
Vijayashanti
Bandi Sanjay
Telangana BJP Chief
Kishan Reddy
BJP

More Telugu News