Bandi Sanjay: అద్భుతంగా పని చేశావ్: బండి సంజయ్‌కి జాతీయ అధ్యక్షుడి ప్రశంస
- బండి సంజయ్ సేవలను వినియోగించుకుంటామన్న నడ్డా
- జాతీయ కార్యదర్శి లేదా కేంద్ర సహాయమంత్రి పదవి ఇస్తారని ప్రచారం
- అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని అధ్యక్షుడితో చెప్పిన సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ సేవలను వినియోగించుకుంటామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. ఈ రోజు నడ్డాతో బండి సంజయ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంజయ్ పై నడ్డా ప్రశంసలు కురిపించారు. అధ్యక్షుడిగా అద్భుతంగా పని చేశావంటూ అభినందించారు. బండి సంజయ్ కి జాతీయ కార్యదర్శి లేదా కేంద్ర సహాయమంత్రి పదవిని ఇవ్వనున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు, తనకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించి, సహాయ సహకారాలు అందించినందుకు గాను జేపీ నడ్డాకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని, ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని పార్టీ జాతీయ అధ్యక్షుడితో చెప్పారని తెలుస్తోంది.
కాగా, బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు, సహకరించినందుకు తెలంగాణ నేతలకు, కార్యకర్తలకు, బీజేపీ అనుబంధ సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కరీంనగర్ కార్యకర్తలు, కరీంనగర్ వోటర్లు కారణమని పేర్కొన్నారు.