Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం

Purandeswari and Kishan Reddy apponted as AP and Telangana BJP Presidents
  • పురందేశ్వరి, కిషన్ రెడ్డిలకు తెలుగు రాష్ట్రాల నాయకత్వ బాధ్యతలు
  • జేపీ నడ్డా పేరిట వెలువడిన ఉత్తర్వులు
  • ఊహించని విధంగా పురందేశ్వరిని వరించిన కీలక పదవి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ... చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Daggubati Purandeswari
Kishan Reddy
Andhra Pradesh
Telangana
BJP
President

More Telugu News