Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం: అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా

Telangana BJP chief Bandi sanjay resings
  • ఢిల్లీలో జేపీ నడ్డాతో భేటీ అనంతరం రాజీనామా సమర్పణ
  • కేంద్రంలో బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం
  • తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముందంజలో కిషన్ రెడ్డి!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంజయ్ తన రాజీనామాను సమర్పించారు. కేంద్రంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరూ వినిపించింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది సాయంత్రం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Bandi Sanjay
G. Kishan Reddy
BJP
Telangana

More Telugu News