Ustaad BhagatSingh: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుంచి అదిరిపోయే స్టిల్స్

Ustaad BhagatSingh is gearing up for the next Massive schedule
  • గబ్బర్ సింగ్ సెట్స్ లో సీన్లను పోలుస్తూ ఫొటోల విడుదల
  • హైదరాబాద్‌ లో రెండో షెడ్యూల్ జరుగుతుందని నిర్మాణ సంస్థ వెల్లడి
  • పవన్–హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పదకొండేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి పవన్, హరీశ్ జట్టు కట్టారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ మరోసారి ఖాకీ డ్రెస్సులో సందడి చేయనున్నారు. ఏప్రిల్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని చెబుతూ నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో అప్‌డేట్‌ ఇచ్చింది. ‘మరోసారి చరిత్రను తిరగరాద్దాం’ అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది.

 ఇందులో గబ్బర్ సింగ్‌, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టిల్స్‌ను పంచుకుంది. పవన్‌ - హరీశ్‌ మధ్య అనుబంధాన్ని చెప్పేలా ఈ ఫొటోలు ఉన్నాయి. ‘కొన్ని విషయాలు, అనుబంధాలు ఎప్పటికీ మారవు’ అంటూ నిర్మాణ సంస్థ క్యాఫ్షన్ ఇచ్చిన ఈ ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుందని, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఆ సెట్‌లో పవన్‌కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ దీనిని నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News