ఆరోగ్యశ్రీపై టీడీపీకి సవాల్ విసిరిన మంత్రి విడదల రజని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరోగ్యశ్రీపై టీడీపీకి సవాల్ విసిరిన మంత్రి విడదల రజని

Vidadala Rajini challenges TDP leaders
  • గుంటూరులో విడదల రజిని సమావేశం
  • ఆరోగ్యశ్రీపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ 
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీపై బహిరంగ చర్చకు మేం సిద్ధం... మీరు సిద్ధమేనా? అంటూ చాలెంజ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి రూ.3,400 కోట్లు ఖర్చు చేస్తామని విడదల రజని వెల్లడించారు. ఎమ్ ప్యానెల్ ఆసుపత్రుల సంఖ్యను 2,275కి పెంచామని తెలిపారు.
Advertisement
Vidadala Rajini
TDP Leaders
Arogya Sri
YSRCP
Andhra Pradesh

More Telugu News