Telangana: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

Contempt of court notices to TS RTC MD Sajjanar
  • తమ ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
  • ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీకి బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశం
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చీఫ్ మేనేజర్ కు నోటీసులు జారీ
తమ ఆదేశాలను పాటించకపోవడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, చీఫ్‌ మేనేజర్‌లకు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీకి బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కానీ, తమ ఆదేశాలు అమలుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ సజ్జనార్, ఆర్టీసీ చీఫ్ మేనేజర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నేరుగా హాజరు కావడం ద్వారాగానీ, న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని సూచించింది.
Telangana
rtc
sajjnar
TS High Court

More Telugu News