Telangana: మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Cm Kcr Expressed Condolenses Maharastra Bus Accident
  • స‌మృద్ధి-మ‌హామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఉదయం ప్రమాదం
  • బస్సు కాలిపోయి 25 మంది సజీవ దహనం
  • మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
మ‌హారాష్ట్ర‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స‌మృద్ధి-మ‌హామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 25 మంది సజీవ‌ద‌హ‌న‌మైన విష‌యం తెలిసిందే. బ‌స్సు టైరు పేల‌డం వ‌ల్ల ప్ర‌మాదం తీవ్ర స్థాయిలో ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. బోల్తా కొట్టిన బ‌స్సు డీజిల్ ట్యాంక్ లీకైంద‌ని, దాని వ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌యాణికులు నిద్ర‌లో ఉన్న కార‌ణంగా 25 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు.
Telangana
KCR
Maharashtra
bus accident

More Telugu News