Anitha Vangalapudi: పేటీఎం బ్యాచ్ వేధింపుల వెనక సజ్జల కుమారుడు.. టీడీపీ నాయకురాలు అనిత ఆరోపణ

Sajjala Bhargava Reddy behind the paytm batch says TDP leader Anitha
  • తెలుగు మహిళలను పేటీఎం బ్యాచ్ లక్ష్యంగా చేసుకుంటోందన్న అనిత
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తోందని ఆవేదన
  • పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్న అనిత

తెలుగుదేశం పార్టీ మహిళా నేతలను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్న పేటీఎం బ్యాచ్ వెనక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఉన్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. భార్గవరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ పేటీఎం బ్యాచ్ తెలుగు మహిళలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తోందన్నారు.

వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ భార్యను దుండగులు అపహరించినా జగన్ స్పందించలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇవ్వని జగన్‌కు వారే బుద్ధి చెబుతారని అనిత హెచ్చరించారు.

  • Loading...

More Telugu News