Tatikonda Rajaiah: సర్పంచ్ నవ్య ఆరోపణలు నిజమైతే రాజయ్యపై చర్యలు తప్పవు: కడియం శ్రీహరి

If allegations are true party will act against MLA Rajaiah says Kadiyam Srihari
  • రోజుకో మలుపు తిరుగుతున్న వివాదం
  • తన ఆరోపణలకు రుజువులు ఉన్నాయన్న నవ్య
  • రాజయ్య, ఎంపీపీ కవిత నుంచి ప్రాణహాని ఉందని ఆరోపణ
  • ఆరోపణలు నిజమా? కాదా? అన్న విషయాన్ని పోలీసులు తేలుస్తారన్న కడియం
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య కొనసాగుతున్న వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. రాజయ్యపై తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలున్నాయని నవ్య స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన ఆమె పక్కా ఆధారాలతో మహిళా కమిషన్‌ను కలుస్తున్నానని నిన్న తెలిపారు. రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందన్న ఆమె పోలీసు రక్షణ కావాలని కోరారు. 

మరోవైపు రాజయ్య, నవ్య వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ..  రాజయ్యపై నవ్య చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే తప్పు చేశారా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు తేలుస్తారని పేర్కొన్నారు. ఆయన తప్పు చేసినట్టు తేలితే కనుక శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
Tatikonda Rajaiah
Sarpanch Navya
BRS
Kadiyam Srihari

More Telugu News