Ashu Reddy: రెండు రోజుల నుంచి మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా: అషు రెడ్డి

Experiencing mental torture since 2 days says Ashu Reddy
  • డ్రగ్స్ కేసులో అరెస్టైన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో అషు రెడ్డి
  • ఈ కేసుతో తనకు సంబంధం లేదన్న అషు
  • మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
డ్రగ్స్ వ్యవహారంలో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఆయన కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల నెంబర్లను గుర్తించారు. ఈ లిస్టులో సినీ యాక్టర్లు అషు రెడ్డి, సురేఖా వాణి, జ్యోతిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అషు రెడ్డి తాజాగా మరోసారి మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపింది. 

డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని తాను ఇప్పటికే చెప్పినప్పటికీ తన గురించి రెండు రోజులుగా చాలా న్యూస్ ఛానల్స్ తన పేరును, ఫోన్ నెంబర్ ను కూడా వేస్తున్నాయని విమర్శించింది. కేపీ చౌదరితో తాను వందల కాల్స్ మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. మీడియాలో వస్తున్న వార్తలతో రెండు రోజుల నుంచి తాను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని చెప్పింది. 

ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినా తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అషు ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ ను వేయడంతో తనకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పింది. విధిలేని పరిస్థితుల్లో ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తనను కించపరిచే విధంగా కథనాలను ప్రసారం చేసిన మీడియా ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించింది. షూటింగ్ పని మీద రెండు నెలలుగా తాను ఇతర దేశాల్లో ఉన్నానని చెప్పింది. తమకు కెరీర్ ఉంటుందనే విషయాన్ని గమనించాలని, తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని కోరింది.
Ashu Reddy
Tollywood
Drugs

More Telugu News