బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని కూతురును కొట్టిన తల్లి.. వీడియో ఇదిగో!

A Mother beats her daughter for having a boyfriend
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • తల్లిదండ్రులపై మండిపడుతున్న నెటిజన్లు.. కేసు పెట్టాలని డిమాండ్
  • ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ ఉండడం మామూలేనంటూ కామెంట్స్
ఈ రోజుల్లో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండడం మామూలేనని, అదేమంత పట్టించుకోవాల్సిన సీరియస్ విషయం కాదని చాలామంది భావిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లికి ముందు ఎలాంటి బంధాలు ఏర్పరుచుకోవద్దని శాసిస్తారు. 

పొరపాటున ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలిస్తే.. ఆ పేరెంట్స్ ఇదిగో ఈ వీడియోలో చూపించిన తల్లిలాగా ప్రతిస్పందిస్తారు. కూతురుకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియడంతో ఓ తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు రెండు చెంపలు వాయిస్తూ తిడుతుంటే.. ఆ కూతురేమో కొట్టొద్దంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. ఇదంతా ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

బాయ్ ఫ్రెండ్ ఉంటే మాత్రం ఇలా దారుణంగా కొట్టేస్తారా? అంటూ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ ను కలిగి ఉండడం మామూలు విషయమేనని చెబుతున్నారు. ఆ తల్లిదండ్రులది క్రూరత్వమేనని కొందరు, పోలీస్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని ఇంకొందరు కామెంట్ చేశారు. ఇది చైల్డ్ అబ్యూజ్ కిందకి వస్తుందంటూ మరికొందరు తీర్పిచ్చేశారు. ఓ వయసుకు వచ్చాక పిల్లలు ప్రేమలో పడడం సాధారణమేనని ఇండియన్ పేరెంట్స్ ఎప్పటికీ గ్రహించలేరని, ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆడపిల్లలు ఇంట్లో వాళ్లతో ఓపెన్ గా ఉండరని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ఇలా ప్రతిస్పందించడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరంపెరుగుతుందని అంటున్నారు.
Go Back to Shorts
Viral Videos
twitter
mother beats daughter
boyfriend
daughter

More Telugu News