Kapu Ramachandra Reddy: ఆ విలేకరులు కొబ్బరిబోండాలు అమ్ముకుంటే మర్యాదగానైనా ఉంటుంది: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

YCP MLA Kapu Ramachandra Reddy Compares Reporters As Brokers
  • ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం
  • పచ్చ చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని వ్యాఖ్య 
  • ఓర్వలేకే ఇలాంటి రాతలు రాస్తున్నారంటూ దూషణ 
మీడియా ప్రతినిధులపై అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. పచ్చ చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని అన్నారు. వారు అందులోంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే కాస్తంత మర్యాదగానైనా ఉంటుందని సలహా ఇచ్చారు. 

రాయదుర్గంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు.

గ్రామస్థులు పత్తిపొలాల్లో పనులకు వెళ్లారని, వారొచ్చిన తర్వాత కలిసి ఫొటోలు తీయించుకున్నామంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేకే ఇలాంటి వార్తలు రాస్తున్నారంటూ దూషించారు.
Kapu Ramachandra Reddy
YSRCP
Rayadurgam

More Telugu News