Shahrukh Khan: తనతో కలిసి సిగరెట్ తాగాలన్న అభిమాని.. షారుక్ ఖాన్ స్పందన ఇదే

Shahrukh Khan response to a fan about smoking with him
  • 31 ఏళ్లు పూర్తి చేసుకున్న షారుక్ 'దీవానా'
  • ఈ సందర్భంగా 31 నిమిషాలు అభిమానులతో ఆన్ లైన్లో ముచ్చటించిన షారుక్
  • తన చెడు అలవాట్లను ఎవరితోనూ పంచుకోనని చెప్పిన బాద్షా
'పఠాన్' సినిమా ఘన విజయంతో షారుక్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు తన చిత్రం 'దీవానా' విడుదలై 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో షారుక్ సోషల్ మీడియా ద్వారా 31 నిమిషాల పాటు ముచ్చటించారు. 'ఆస్క్ ఎస్ఆర్కే' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానాలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఓ అభిమాని షారుక్ ను ఒక కోరిక కోరాడు. మీతో కలిసి సిగరెట్ తాగాలని ఉందని అన్నాడు. దీనికి షారుక్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తన చెడు అలవాట్లను ఎవరితోనూ పంచుకోనని, అవి తనతోనే ఉంటాయని చెప్పారు. షారుక్ సమాధానం పట్ల నెటిజెన్లు స్పందిస్తూ... బాగా చెప్పారని ప్రశంసిస్తున్నారు. స్మోకింగ్ అలవాటును మీరు కూడా వదిలేయొచ్చు కదా అని మరికొందరు కోరుతున్నారు.
Shahrukh Khan
Bollywood
Smoking

More Telugu News