Pooja Hegde: మహేశ్ బాబు సినిమాలో మీనాక్షి చౌదరి?

Pooja Hegde out of Mahesh Babu Guntur Kaaram Meenakashi Chaudhary roped in
  • గుంటూరు కారం సినిమాలోకి కొత్తగా మీనాక్షి చౌదరి
  • ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం
  • షూటింగ్ షెడ్యూల్ లో మార్పులతో తప్పుకున్న పూజ 
గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఒప్పందం చేసుకున్న పూజ హెగ్డే పదిరోజుల పాటు షూటింగ్ లకు సైతం హాజరయ్యింది. మరి ఏమైందో కానీ, సినిమా నుంచి విరమించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొత్తగా మీనాక్షి చౌదరిని పూజ స్థానంలో నియమించుకున్నట్టు తెలిసింది. పూజ హెగ్డేతో ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలను తిరిగి మీనాక్షి చౌదరితో చిత్రీకరిస్తారు. గుంటూరు కారం సినిమా షెడ్యూల్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. షూటింగ్ తేదీల్లో మార్పులు చేయడం వల్ల తన ఇతర సినిమాల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మీనాక్షి చౌదరి 2021లో 'ఇచట వాహనాలు నిలుపరాదు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ కావడం తెలిసిందే.
Pooja Hegde
Mahesh Babu
Guntur Kaaram
Meenakashi Chaudhary

More Telugu News