Virender Sehwag: 'ఆదిపురుష్' చూశాక సెహ్వాగ్ ఏమన్నాడంటే...!

What Virender Sehwag tweets after watching Adipurush
  • ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్
  • ఓం రౌత్ దర్శకత్వంలో చిత్రం
  • టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం
  • ఆసక్తికర ట్వీట్ చేసిన సెహ్వాగ్
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా వారం లోపే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. 

కాగా, ఈ చిత్రంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఆదిపురుష్ చిత్రం చూసిన సెహ్వాగ్... "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఈ సినిమా చూశాక అర్థమైంది" అంటూ ట్వీట్ చేశాడు. 

అయితే సెహ్వాగ్ ట్వీట్ ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది. సెహ్వాగ్ తన కామెంట్ ద్వారా నెగటివ్ గా స్పందించాడని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ సినిమాపై ఇలా నెగటివ్ గా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 

సెహ్వాగ్ విషయం అటుంచితే... ఆదిపురుష్ చిత్రంపై అనేకరకాలుగా ట్రోలింగ్ జరుగుతోంది. రాముడికి మీసాలేంటని కొందరు, హనుమంతుడి పాత్ర పలికే డైలాగులపై మరికొందరు, రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ ను విమర్శిస్తూ మరికొందరు... సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Virender Sehwag
Adipurush
Prabhas
Om Rout

More Telugu News