Suman: ఏపీలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది: నటుడు సుమన్

Suman says there is no protection for BC people in AP
  • పెదకాకానిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ
  • హాజరైన సినీ నటుడు సుమన్, గౌతు శిరీష
  • బాపట్ల జిల్లాలో విద్యార్థి హత్యపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్న సుమన్
  • మేలు చేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని సూచన

గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తదితరులు హాజరయ్యారు. 

విగ్రహావిష్కరణ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, ఏపీలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిని హత్య చేస్తే ఇప్పటివరకు చర్యలు లేవని విమర్శించారు. 

ఏపీలో కులానికొక పార్టీ ఉంది కానీ, బీసీలకు మాత్రం ఏ పార్టీ లేదని అన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలని సుమన్ బీసీలకు పిలుపునిచ్చారు. మేలు చేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని పేర్కొన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని సుమన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News