కరోనా మూలాలు వుహాన్ ల్యాబ్‌లోనే ఉన్నాయనడానికి ఆధారాల్లేవు: అమెరికా నిఘా విభాగం నివేదిక

US Agencies Big Statement On Corona Virus
  • కచ్చితమైన ఆధారాలను గుర్తించలేకపోయామన్న అమెరికా నిఘా విభాగాలు
  • కరోనాపై వుహాన్‌ ల్యాబ్‌లో విస్తృత పరిశోధనలు నిజమేనన్న యూఎస్ ఏజెన్సీలు
  • వైరస్ ల్యాబ్‌లో పుట్టిందా? సహజంగా ఉద్భవించిందా? అన్నది పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టీకరణ
కరోనా వైరస్ వ్యాప్తి మందగించినా దాని గురించిన వార్తలు మాత్రం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ఇనిస్టిట్యూట్ నుంచి బయటపడిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని, ఇందుకు సంబంధించి నేరుగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అమెరికా నిఘా విభాగాలు తెలిపాయి. ఈ మేరకు ‘ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’ (వోడీఎన్ఐ) నాలుగు పేజీల నివేదికలో పేర్కొంది. వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని తోసిపుచ్చలేమని, అయితే, ఇందుకు సంబంధించి మహమ్మారి మూలాలను ఇప్పటి వరకు కనుగొనలేకపోయామని పేర్కొంది.

మహమ్మారి కచ్చితమైన మూలాన్ని కేంద్ర నిఘా విభాగంతోపాటు మరో ఏజెన్సీ కూడా గుర్తించలేకపోయిందని వోడీఎన్ఐ తెలిపింది. కరోనా వైరస్ సహజంగా పుట్టిందా? ల్యాబ్‌లో తయారైందా? అన్నది పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని వివరించింది. కరోనాపై వుహాన్ ఇనిస్టిట్యూట్ (డబ్ల్యూఐవీ) విస్తృతంగా పనిచేసినప్పటికీ అమెరికా ఏజెన్సీలు మాత్రం మహమ్మారి మూలాలకు సంబంధించిన ఆధారాలను కనుగొనలేకపోయాయని నివేదికలో వివరించింది.
Go Back to Shorts
America
US Intelligence Agencies
Corona Virus
Wuhan Lab
China

More Telugu News