GHMC: అర్ధరాత్రి భారీ వర్షంతో తడిసిముద్దయిన హైదరాబాద్.. అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ

  • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
  • పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • అవసరమైతే 040-29555500 నంబరుకు కాల్ చేయాలన్న జీహెచ్ఎంసీ
Heavy Rain Lashes Hyderabad Last Night

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు చెరువులను తలపించాయి.

ముఖ్యంగా అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే 040-29555500కు కాల్ చేయాలని సూచించారు.

More Telugu News