ధోనీ అభిమానులకు శుభవార్త!
- వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడతాడంటూ కథనాలు
- ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో మోకాలి నొప్పితోనే ఆడిన ధోనీ
- ఐపీఎల్ ముగిశాక గాయానికి శస్త్రచికిత్స
- ప్రస్తుతం కోలుకుంటున్న ధోనీ
అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ ప్రతి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ ముగిశాక ముంబయిలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ప్రస్తుతం కోలుకుంటున్న ధోనీ... వచ్చే సీజన్ గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్-2024లోనూ ఆడాలని భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ధోనీ అభిమానులకు అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. వాస్తవానికి ఏడాదికి మూడు నెలలు కేటాయిస్తే సరిపోతుంది... కానీ రిటైరైన ఆటగాళ్లకు ఫిట్ నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. మ్యాచ్ లు లేకుండా చాలా రోజుల పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ధోనీ మాత్రం అలాంటి ప్రభావం కనిపించనివ్వకుండా, గత సీజన్ లో ఐపీఎల్ లో అద్భుత రీతిలో నాయకత్వ ప్రతిభ చూపి సీఎస్కేను ఐదోసారి విజేతగా నిలిపాడు.