Rashmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై స్పందించిన నటి రష్మిక

Rashmika responds on Manager issue
  • తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్న రష్మిక 
  • కెరీర్ లో ఎవరికి వాళ్లం ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
  • పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని చెప్పిన రష్మిక

తన వ్యక్తిగత మేనేజర్ మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, కెరీర్ లో ఎవరికి వారు ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని, తాము ప్రొఫెషనల్స్‌మని, ఎక్కడైనా పనికి కట్టుబడి ఉంటామన్నారు. రష్మికను మేనేజర్ ఆర్థికంగా మోసం చేశారని, ఆమెకు తెలియకుండా రూ.80 లక్షలు కాజేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. విషయం తెలియడంతో రష్మిక అతనిని తొలగించిందంటూ కూడా మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక స్పందించారు.

  • Loading...

More Telugu News