titanic: కీలకమైన 96 గంటలు: గురువారం నాటికి జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తి

Hope Fades As Missing Titanic Submersible Might Be Stuck Twice As Deep As Grand Canyon
  • గల్లంతైన టైటాన్ సబ్‌మెరైన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు
  • జలాంతర్గామి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా
  • ఆక్సిజన్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పిన యూఎస్ కోస్ట్ గార్డ్!

అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం పెద్దఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురితో ఆదివారం బయలుదేరిన జలాంతర్గామి కనిపించకుండా పోయి కీలకమైన 96 గంటలు దాటింది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. మినీ సబ్ మెరైన్ లోని ఆక్సిజన్ కూడా దగ్గరపడింది. 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఇది కాస్తా గడుస్తుండటంతో సందర్శకుల క్షేమంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ పూర్తి కావొస్తుండటంతో వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుండి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని గుర్తించేందుకు యూఎస్ కోస్ట్ గార్డు, ఇతర రోబోలు, ప్రపంచవ్యాప్తంగా రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగింది. అమెరికా, కెనడా యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించి సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. జలాంతర్గామి టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ఆధునాతన సాంకేతికతతో కూడిన రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. రెస్క్యూ బృందాలు సముద్రంలో నాలుగు కిలో మీటర్ల లోతున వెతుకుతున్నాయి. 

టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి. పూర్తిగా చీకటిగా ఉంటుంది. సబ్ మెర్సిబుల్ లోని లైట్లతో కేవలం కొంత దూరమే కనిపిస్తుంది. దాదాపు రెండున్నర గంటల పాటు చీకటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

టైటాన్ జలాంతర్గామిలో ఆక్సిజన్ సరఫరా గురువారం సాయంత్రం గం.12.08కి పూర్తి కావొచ్చునని యూఎస్ కోస్ట్ గార్డ్ అంచనా వేశారు. గల్లంతైన సబ్ మెరైన్ లో బ్రిటిషన్ బిజినెస్ మెన్, అడ్వెంచరర్ హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన యూకే వ్యాపారవేత్త షెహ్జాదా దావూద్, అతని తనయుడు సులేమన్ దావూద్, ఓసియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫౌండర్ స్టాక్టాన్ రష్, ఫ్రెంచ్ సబ్ మెరైన్ పైలట్ పాల్ హెన్రీ నార్గోలెట్ ఉన్నారు.

  • Loading...

More Telugu News