Rachita Mahalakshmi: అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడని భర్తపై టీవీ నటి రచిత ఫిర్యాదు

Rachita Mahalakshmi complains on her husband
  • భర్తపై చెన్నై మహిళా పోలీసులకు రచిత ఫిర్యాదు
  • 'పిరివం సంతిప్పమ్' సీరియల్ లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రచిత, దినేశ్
  • 2013లో పెళ్లి చేసుకున్న జంట

తన భర్త దినేశ్ కార్తీక్ తనను ఫోన్ లో బెదిరిస్తున్నాడని, అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడని చెన్నై మహిళా పోలీసులకు బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దినేశ్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఆమెకు అంతగా కావాలనుకుంటే విడాకులు తీసుకోవచ్చని పోలీసులకు చెప్పి వెళ్లిపోయాడు. 

'పిరివం సంతిప్పమ్' సీరియల్ లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆన్ స్క్రీన్ లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వీరు... ప్రేమలో పడ్డారు. 2013లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, కొంతకాలం క్రితం ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇంకోవైపు పలు ఇంటర్వ్యూలలో దినేశ్ మాట్లాడుతూ ఎప్పటికైనా గొడవలు సద్దుమణిగి కలిసిపోతామని చెప్పాడు. ఇంతలో రచిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ న్యూస్ గా మారింది. రచిత తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈటీవీలో ప్రసారమైన 'స్వాతిచినుకులు' సీరియల్ లో ఆమె నటించింది.

  • Loading...

More Telugu News