Narendra Modi: మోదీకి బైడెన్ దంపతులు ఇచ్చిన బహుమతులు ఇవే!

Joe Biden gifts to Modi
  • వైట్ హౌస్ లో మోదీకి ఆతిథ్యమిచ్చిన బైడెన్ దంపతులు
  • బహుమతులను ఇచ్చిపుచ్చుకున్న ఇరువురు దేశాధినేతలు
  • మోదీకి పాత కాలపు కెమెరాను బహూకరించిన బైడెన్
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వైట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్ బైడెన్ లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతలు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీకి బైడెన్ దంపతులు పలు బహుమతులను అందించారు. వీటిలో 20వ శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీ ఉంది. పాతకాలానికి చెందిన ఓ కొడక్ కెమెరాను బహూకరించారు. అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని ఇచ్చారు. రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన మొదటి ఎడిషన్ కాపీని మోదీకి జిల్ బైడెన్ బహూకరించారు.  

Narendra Modi
BJP
Joe Biden
Gifts

More Telugu News