Kerala: విడాకుల కేసులో కోర్టుపై అసంతృప్తి.. జడ్జీ కారు అద్దాలు పగలగొట్టిన వ్యక్తి

Litigant Vandalizes Car Of Family Court Judge In Kerala
  • కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టులో బుధవారం వెలుగు చూసిన ఘటన
  • భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌కు సంబంధించి కోర్టు తీరుపై భర్త అసంతృప్తి
  • న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు వినిపించుకోలేదని ఆక్రోశం
  • న్యాయం జరగలేదంటూ కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి కారు అద్దాలు పగలగొట్టిన భర్త
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన ఆక్రోశం ప్రదర్శించాడు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన కారు అద్దాలను పగలగొట్టాడు. కారుకు సొట్టలు పడేలా రెచ్చిపోయాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ‘‘భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని అతడు కోపోద్రిక్తుడయ్యాడు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Kerala
Viral Pics

More Telugu News