Bihar: రైలు నుంచి విడిపోయిన బోగీలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Guwahati jammu rail splits into two accident averted
  • బీహార్‌లో మంగళవారం వెలుగు చూసిన ఘటన
  • గువాహటి-జమ్మూ రైలు నుంచి విడిపోయిన బోగీలు
  • మిగిలిన బోగీలతోనే కొంత దూరం వెళ్లిన రైలు 
  • తీవ్ర ఆందోళనకు లోనైన ప్రయాణికులు, బోగీల నుంచి దిగిపోయి పరుగులు
  • పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు
బీహార్‌లో మంగళవారం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి జమ్మూకు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కొన్ని బోగీలు అకస్మాత్తుగా విడిపోయాయి. మిగిలిన బోగీలతోనే రైలు కొంత దూరం ముందుకెళ్లింది. కటిహార్ జిల్లాలో దల్ఖోలా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే, బోగీలు విడిపోవడంతో తీవ్ర ఆందోళనకు లోనై వారు రైలు నుంచి కిందకు దూకేశారు. విషయం తెలిసిన రైల్వే అధికారులు ఈ మార్గంలో కొంత సేపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం, బోగీలను తిరిగి రైలుకు జత చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
Bihar
Indian

More Telugu News