ponguleti srinivas reddy: మూడు, నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ప్రకటన చేస్తాం: పొంగులేటి వ్యాఖ్య

  • తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామన్న మాజీ ఎంపీ
  • కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని వెల్లడి
  • తాను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామన్న పొంగులేటి
Ponguleti ready to join congress soon

మూడు నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రకటించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలతో భేటీ అయ్యారు. వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపల్లితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. ఉద్యమకారులు, ప్రజలు, కవులతో ఇప్పటికే చర్చలు జరిపామని, కొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

మూడు నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆరు నెలల నుండి తాము రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. తాను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామన్నారు. తెలంగాణ సాధించాక ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు తమతో కలిసి రావాలని ఆహ్వానించామని చెప్పారు. ఖమ్మం నేతలు అందరూ పొంగులేటి కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నారన్నారు.

More Telugu News