Rashmika Mandanna: మోసం నిజమేనా..? రష్మిక, ఆమె మేనేజర్ కు మధ్య అసలేం జరిగింది?

 Rashmika and Her Ex Manager This What Really Happened
  • రష్మికను మేనేజర్ రూ. 80 లక్షల మేర మోసం చేసినట్టు వార్తలు
  • విషయం తెలిసి అతడిని తొలగించిందని పుకార్లు
  • ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయారంటున్న సన్నిహితులు
తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించి రెండు రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రష్మిక వద్ద చాన్నాళ్ల నుంచి పని చేసిన ఓ మేనేజర్ రూ. 80 లక్షల మేర ఆమెను మోసం చేశాడన్నది వాటి సారాంశం. తెలుగులో రష్మిక తొలి చిత్రం ఛలో నుంచి తనతో కలిసి పనిచేస్తున్న సదరు మేనేజర్‌ని ఆమె తొలగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. విషయం పెద్దది చేయడం ఇష్టం లేక అతనిపై రష్మిక పోలీసులకు ఫిర్యాదు చేయలేదని టాలీవుడ్ వర్గాలు చెప్పాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. సదరు మేనేజర్, రష్మిక స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం రష్మికకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ముంబైలోని క్వాన్ టాలెంట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. క్వాన్ ఆమెను పూర్తిగా మేనేజ్ చేస్తోంది. అందుకే, రష్మిక తన సౌత్ మేనేజర్‌ని తొలగించాలని నిర్ణయించుకుంది. సదరు మేనేజర్‌ సౌత్ లో మరో ప్రముఖ ఆర్టిస్ట్ వద్ద కూడా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ‘రష్మిక, ఆమె మాజీ మేనేజర్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారు తమ వ్యక్తిగత కారణాలతో స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు’ అని నటి సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
Rashmika Mandanna
MANAGER
RS 80L

More Telugu News