హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత
- కొందరిని కాల్చి చంపి, మరికొందరిని సజీవ దహనం చేసిన వైనం
- మరాస్ వీధి ముఠాల పనేనన్న అధ్యక్షుడు
- జైలు నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, కత్తులు స్వాధీనం
ఈ హింసాకాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల సెల్ బ్లాకుల్లోకి చొరబడి కొందరిని కాల్చి చంపింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.