Ambati Rambabu: పవన్ కంటే బ్రహ్మానందం గొప్ప మేధస్సు ఉన్నవాడు: అంబటి రాంబాబు

Ambati Rambabu said Brahmanandam far better intellectual than Pawan Kalyan
  • పవన్ రాజకీయాల్లోకి వచ్చి కమెడియన్ అయ్యాడన్న మంత్రి అంబటి
  • బ్రహ్మానందం సినిమాల్లోనే నటిస్తారని, బయట నటించరని వెల్లడి
  • బ్రహ్మానందంకు జీవితంలో చాలా తెలుసని వివరణ
  • రామాయణ, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడగలడని స్పష్టీకరణ
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి కమెడియన్ అయ్యాడని ఎద్దేవా చేశారు. 

పవన్ ఒక సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటాడు... మీరు ఆయనను కామెడీ అంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా...  పవన్ 100 శాతం కామెడీయేనని అంబటి స్పష్టం చేశారు. ఒక సినిమాకు కోట్లు తీసుకోవడం గొప్పేమీ కాదని, కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒక సినిమాకు 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చి, రోజుకు లెక్కగట్టి కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని అంబటి వివరించారు.

బ్రహ్మానందం, పవన్ ఒకటేనంటారా అని యాంకర్ ప్రశ్నించగా... ఇద్దరూ నటులే కదా అని అంబటి బదులిచ్చారు. "బ్రహ్మానందం సినిమాల్లోనే కమెడియన్... జీవితంలో నటించరు... చాలా సీరియస్ మ్యాన్. జీవితంలో చాలా తెలిసిన వ్యక్తి బ్రహ్మానందం. పవన్ కంటే చాలా మేధావి బ్రహ్మానందం. ఆయన అనేక పుస్తకాలు చదివారు... రామాయణం, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడగలరు" అని అంబటి వివరించారు.
Ambati Rambabu
Brahmanandam
Pawan Kalyan
YSRCP
Janasena

More Telugu News