Ram Charan: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్, స్నేహ

Allu Arjun and Sneha visit Ram Charan Upasana and their baby girl at hospital
  • అల్లు అరవింద్ దంపతులు సైతం సందర్శన
  • ప్రముఖుల నుంచి రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు
  • త్వరలో షూటింగ్ లకు హాజరు కానున్న రామ్ చరణ్
రామ్ చరణ్ భార్య ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వడంతో ప్రముఖులు అపోలో ఆసుపత్రి బాట పడుతున్నారు. వారిని చూసేందుకు అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్ దంపతులు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. రామ్ చరణ్ దంపతులకు ఎంతో మంది నుంచి అభినందనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సైతం సతీ సమేతంగా అపోలో హాస్పిటల్ కు వెళ్లి తన మనవరాలిని చూసి వచ్చారు. మెగా ప్రిన్సెస్ కు ఘన స్వాగతం కూడా చెప్పారు.

మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడపిల్లను ప్రసవించింది. ఉపాసన డెలివరీ నేపథ్యంలో రామ్ చరణ్ మూడు నెలల నుంచి సినిమా షూటింగ్ లకు విరామం తీసుకున్నాడు. ఇప్పుడు ఉపాసన డెలివరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ తిరిగి త్వరలోనే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి అపోలో ఆసుపత్రికి వచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరాయి.  (ఇన్ స్టా వీడియో కోసం)
Ram Charan
Upasana
baby girl
apolo hopsital
allu arjun
sneha

More Telugu News