Chiranjeevi: రామ్ చరణ్ కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇదే!

Chiranjeevi emotional response on grand daughters birth
  • పోలికలు ఎవరివి వచ్చాయనే విషయాన్ని అప్పుడే చెప్పలేమన్న చిరంజీవి
  • ఆడబిడ్డ జన్మించడాన్ని అపురూపంగా భావిస్తున్నామని వ్యాఖ్య
  • ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని వెల్లడి
రామ్ చరణ్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. మరోవైపు తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగితేలుతున్నారు. ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి... కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. 

చరణ్ కూతురికి ఎవరి పోలికలు వచ్చాయంటూ అడిగిన ప్రశ్నకు బదులుగా... పోలికలు ఎవరివి వచ్చాయనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని అన్నారు. మంగళవారం నాడు అమ్మాయి పుట్టిందని... ఆంజనేయస్వామిని తాము నమ్ముకున్నామని, ఆయనకు ప్రత్యేకమైన మంగళవారంనాడు ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని చెప్పారు. అపోలో ఆసుపత్రి ఛైర్మన్ పీసీ రెడ్డిగారు (ఉపాసన తాత) దగ్గరుండి అన్ని రకాలుగా కేర్ తీసుకున్నారని, బెస్ట్ మెడికల్ టీమ్ ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని వెల్లడించారు.
Chiranjeevi
Ramcharan
Upasana
Tollywood

More Telugu News