Narendra Modi: ఈజిప్ట్ పర్యటనలో చారిత్రక మసీదును సందర్శించనున్న ప్రధాని మోదీ

PM Modi to visit mosque in Egypt
  • దావూదీ బోహ్రా వర్గం వారు పునరుద్ధరించిన మసీదు
  • 11వ శతాబ్దానికి చెందిన పురాతన అల్ హకీమ్ మసీదు
  • 1997 తర్వాత ఓ ప్రధాని ఈజిప్ట్ దేశానికి ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి

జూన్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటన ప్రారంభం కానుంది. తొలుత అమెరికా వెళ్లి, ఆ తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లనున్నారు. 1997 తర్వాత ఓ భారత ప్రధాని ఈజిప్ట్ దేశానికి ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. అధినేతల భేటీ కంటే ముందు ఇరుదేశాల కీలక మంత్రులు సమావేశమవుతారు.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా అక్కడి చారిత్రక మసీదును సందర్శించనున్నారు. దీనిని దావూదీ బోహ్రా వర్గం వారు పునరుద్ధరించారు. 11వ శతాబ్దానికి చెందిన పురాతన అల్ హకీమ్ మసీదు సందర్శన అనంతరం హెలియో పోలీస్ లోని యుద్ధ స్మారకానికి ప్రధాని వెళ్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈజిప్ట్ తరఫున పోరాడి అమరులైన భారత సైన్యానికి మోదీ నివాళులర్పిస్తారు. కాగా మోదీ కొన్ని నెలల క్రితం ముంబైలో దావూద్ బోహ్రా మత పెద్దలతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News