Ram Gopal Varma: ఏపీ సీఎం జగన్ తో ముగిసిన రామ్ గోపాల్ వర్మ సమావేశం

Director Ram Gopal Varma met AP CM Jagan
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వర్మ
  • సీఎం జగన్ తో గంటకు పైగా భేటీ
  • మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే పొలిటికల్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వర్మ నేడు ఏపీ సీఎం జగన్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వర్మ... దాదాపు గంటకు పైగా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సినిమాకు సంబంధించిన అంశాలపైనే సీఎం జగన్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. భేటీ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 

వర్మ ఇటీవల వ్యూహం చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికి వదిలారు. ఆ స్టిల్స్ కొందరు రాజకీయ రంగానికి చెందిన, వారి కుటుంబాలకు చెందిన వారిని పోలి ఉండడంతో వ్యూహం కథేంటన్నది అందరూ ఓ అంచనాకు వచ్చారు.

  • Loading...

More Telugu News