Rakul Preet Singh: అలా వ్యవహరిస్తే బంధం విచ్చిన్నమే: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh reveals biggest deal breaker in a relationship Lying and emotional cheating are strict no no
  • అనుబంధంలో అబద్ధాలు పనికిరావన్న రకుల్
  • భాగస్వాములు స్నేహితుల్లా ఉండాలని సలహా 
  • తప్పులు చేయడం సహజమేనంటూ వాటిని కప్పి పుచ్చడమే తప్పన్న నటి
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీతో సహజీవనం చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. అయితే, ఎలాంటి అంశాలు ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నానికి దారితీస్తాయనే విషయాలను ఆమె న్యూస్18 మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. 

‘‘అనుబంధం విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అబద్ధాలు చెప్పడమే. అనుబంధంలో చెప్పకూడని విషయం ఏదీ ఉండదు. రిలేషన్ షిప్ లో ప్రాథమికంగా స్నేహితుల మాదిరే ఉండాలి. నా భాగస్వామి తప్పు చేస్తే అతడు నేరుగా ముందుకు వచ్చి అదే విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే మనమంతా మనుషులం. సహజంగానే తప్పులు చేస్తుంటాం. కానీ, అబద్ధాలు చెబుతూ, వాటిని మళ్లీ అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, మోసం చేయడం, భావోద్వేగపరమైన మోసం నా వరకు అస్సలు నచ్చదు’’ అని రకుల్ ప్రీత్ సింగ్ వివరించింది.

తన వరకు ప్రేమ అన్నది ఎలాంటి షరతులు లేకుండా ఉండాలని చెప్పింది. ‘‘ప్రేమ అన్నది మౌనంలో ప్రశాంతతను వెతుక్కుంటుంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. నేడు ప్రేమ అనే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే, వారు మనం కోరుకున్నట్టుగా చేయాలనుకుంటాం. అంతేకానీ, వారి ప్రేమను సహజంగా పరిమళించాలనుకోం. కానీ  ప్రేమ అనేది మీలోని ఉత్తమ కోణాన్ని ఆవిష్కరించేదిలా ఉండాలని నేను కోరుకుంటాను’’ అని రకుల్ తన అభిప్రాయాలను పంచుకుంది.
Rakul Preet Singh
relationship
Lying
emotional cheating

More Telugu News