Rashmika Mandanna: రష్మిక మందన్నను మోసగించిన మేనేజర్?

Rashmika Mandanna manager allegedly cheats her of RS 80 lakh gets fired
  • రూ.80 లక్షలకు చీటింగ్
  • విషయం బయటపడడంతో అతడ్ని తొలగించిన రష్మిక
  • రాద్ధాంతం జరగకుండా చర్యలు

ప్రముఖ నటి రష్మిక మందన్నా తన మేనేజర్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. మేనేజర్ ఆమెను రూ.80 లక్షలకు మోసగించినట్టు బయటపడడంతో రష్మిక ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచి మేనేజర్ గా ఒకే వ్యక్తి పనిచేస్తుండడం గమనార్హం. దీనిపై రష్మిక అధికారికంగా స్పందించలేదు. 

తనను రూ.80 లక్షలకు మోసగించినట్టు గుర్తించిన రష్మిక దీనిపై రాద్ధాంతం జరగకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. దీనికి స్పందనగా అతడ్ని మేనేజర్ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. కాగా, రష్మిక త్వరలో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ తోపాటు నటించనుంది. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. మరోవైపు పుష్ప సినిమా సీక్వెల్ లోనూ నటిస్తోంది.

  • Loading...

More Telugu News