Khusbhu: తమిళనాడు గవర్నర్, ఖుష్బూలపై విమర్శలు చేసిన డీఎంకే నేత అరెస్ట్

DMK leader who commented on Khusbhu arrested
  • జనవరిలో గవర్నర్, ఖుష్బూలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీ కృష్ణమూర్తి
  • అప్పట్లోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన స్టాలిన్
  • తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేతపై తమిళనాడు ముఖ్యమంత్రి వేటు వేశారు. డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. గవర్నర్, ఖుష్బూలను కించపరిచేలా మాట్లాడుతూ శివాజీ కృష్ణమూర్తి అనే డీఎంకే నేత జనవరిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఖుష్బూ స్పందిస్తూ ఇది సిగ్గుచేటు అని అన్నారు. అంతేకాదు, ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను స్టాలిన్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

మీ కుటుంబంలో ఉన్న మహిళలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు మౌనంగా ఉంటారా? అని స్టాలిన్ ను ఖుష్బూ ప్రశ్నించారు. మీకు అర్థంకాని విషయం ఏమిటంటే... ఆయన కేవలం తనను మాత్రమే అవమానించలేదని... మిమ్మల్ని, మీ తండ్రిని కూడా అవమానించినట్టేనని చెప్పారు. మీరు అతన్ని ఎంత వెనకేసుకొస్తే, రాజకీయంగా మీరు అంత పతనమయినట్టేనని అన్నారు. దీనిపై స్పందించిన స్టాలిన్ శివాజీని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా, ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News