Hyderabad: భార్య తనతో మాటలు తగ్గించిందని భర్త ఆత్మహత్య

Hyderabad man ends life after wife stops talking to him
  • హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో వెలుగు చూసిన ఘటన
  • స్థానికంగా నివసించే నరసింహకు రెండేళ్ల క్రితం వివాహం
  • నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య శివాని
  • ఆ తరువాత భర్తతో మాటలు తగ్గించిన వైనం
  • మనస్తాపం చెందిన నరసింహ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య
పుట్టింటికి వెళ్లిన భార్య తనతో మాటలు తగ్గించేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో నివసించే పెద్ద నరసింహకు రెండేళ్ల క్రితం శివానితో వివాహం జరిగింది. అయితే, నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన శివాని భర్తతో మాటలు తగ్గించింది. 

అత్త మాట్లాడినా కూడా సరిగ్గా స్పందించట్లేదు. దీంతో, మనస్తాపం చెందిన నరసింహ ఆదివారం తన గదిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad

More Telugu News