Rakesh Master: టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి

Choreographer Rakesh Master dies of illness
  • విజయనగరం నుంచి వస్తూ అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • టాలీవుడ్ లో విషాద ఛాయలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాకేశ్ మాస్టర్ వయసు 53 సంవత్సరాలు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రక్త విరోచనాల బారినపడ్డారు. ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్చగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 

రాకేశ్ మాస్టర్ సినీ కొరియోగ్రాఫర్ గా కొన్ని వందల సినిమాలకు నృత్య రీతులు సమకూర్చారు. రాకేశ్ మాస్టర్ మృతితో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా రాకేశ్ మాస్టర్ శిష్యుడే.

  • Loading...

More Telugu News