Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూ మూవీ టైటిల్ ఇదేనంటూ టాక్!

Vijay Devarakonda new movie update
  • పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విజయ్ దేవరకొండ 
  • ఇద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా 
  • కథానాయికగా మృణాళిని ఠాకూర్ 
  • త్వరలోనే టైటిల్ పోస్టర్ ను వదిలే ఛాన్స్

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ మరో సినిమాను చేస్తున్నాడు. 'గీత గోవిందం' హిట్ తరువాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ తో లాంఛనంగా షూటింగు మొదలైంది. 

ఈ సినిమాకి నిన్నమొన్నటి వరకూ టైటిల్ ను నిర్ణయించలేదు. అయితే ఇప్పుడు టైటిల్ గురించిన ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. 'కుటుంబరావు' అనేది ట్యాగ్ లైన్. కథను బట్టి ఈ టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. దిల్ రాజు ఓకే చేస్తే మాత్రం అందులో ఏదో మేటర్ ఉందనే అనుకోవాలి. 

ఈ సినిమాలో కథానాయికగా మృణాళిని ఠాకూర్ ను తీసుకున్నారు. 'సీతారామం' తరువాత సినిమాను ఆమె నాని సరసన చేస్తోంది. విజయ్ దేవరకొండ జోడీగా చేస్తున్నది మూడో సినిమా. గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

  • Loading...

More Telugu News