Upasana: ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు విశిష్ట కానుక

Prajwala Foundation gifts a cradle to Upasana and Ram Charan
  • ఉయ్యాలను బహూకరించిన ప్రజ్వల ఫౌండేషన్
  • మురిసిపోయిన ఉపాసన
  • ఈ కానుక అందుకోవడం  గౌరవంగా భావిస్తున్నామని వెల్లడి
అణగారిన మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజ్వల ఫౌండేషన్. ఈ సంస్థ తాజాగా ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు ఓ విశిష్ట కానుకను బహూకరించింది. ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఓ ఉయ్యాలను ఉపాసనకు స్వయంగా అందించారు. 

దీనిపై ఉపాసన ట్విట్టర్ లో స్పందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారు హృదయపూర్వకంగా అందించిన ఈ కానుక తమను సంతోషానికి గురిచేసిందని తెలిపారు. ఈ ఉయ్యాలను స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 

"పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది స్త్రీ శక్తికి, నిబ్బరానికి ప్రతీక. పుట్టినప్పటి నుంచి నా బిడ్డ ఆత్మగౌరవంతో ఎలా పెరగాలన్నదానిని ఇది సూచిస్తుంది" అని ఉపాసన ట్వీట్ చేశారు. 

కాగా, వ్యభిచార కూపంలో చిక్కుకున్న చాలామంది మహిళలను ప్రజ్వల ఫౌండేషన్ కాపాడి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. వ్యభిచారం నుంచి బయటికి వచ్చి ప్రజ్వల ఫౌండేషన్ లో శిక్షణ పొందిన కొందరు మహిళలే ఈ ఉయ్యాలను రూపొందించడం విశేషం. అందుకే ఉపాసన ఈ ఉయ్యాల పట్ల భావోద్వేగాలతో స్పందించారు.
Upasana
Ram Charan
Cradle
Prajwala Foundation
Gift
Hyderabad
Tollywood

More Telugu News