శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం.. ఎందుకంటే!
- ప్రయాణికుల ఆందోళనను తగ్గించేందుకు ప్రత్యేకంగా నియామకం
- ఇందుకోసం పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ
- యానిమల్ అసిస్టెడ్ థెరపీ కోసం పిల్లికి ఉద్యోగం
ఇంతకీ విమానాశ్రయంలో ఆ పిల్లి చేసే పనేంటంటే.. మొదటిసారి విమాన ప్రయాణం చేయడం వల్లో లేక విమాన ప్రయాణమంటే భయంవల్లో కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారట. అలాంటి ప్రయాణికుల వల్ల విమానాశ్రయంలో, విమాన ప్రయాణంలో చాలాసార్లు గందరగోళం నెలకొంటుందని అధికారులు చెప్పారు. వారి ఆందోళనను తగ్గించడమే ఈ పిల్లిగారి పని. ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఆపై భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని వివరించారు.