Donald Trump: రెస్టారెంట్‌లో బిల్లు కట్టకుండా వెళ్లిపోయిన ట్రంప్..! నెట్టింట విపరీతంగా ట్రోలింగ్

Trump promise free food for all in restaurant leaves without paying bill
  • ఇటీవల మియామీలోని ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్
  • అక్కడ తనను చూసేందుకు వచ్చిన వారికి తానే ఆహారం కొనిస్తానని హామీ 
  • కానీ, బిల్లు చెల్లించకుండా ట్రంప్ వెళ్లిపోయారంటూ కథనాలు 
  • ఈ వార్తలను ఖండించిన ట్రంప్ ప్రతినిధి
  • రెస్టారెంట్‌లో ట్రంప్ కొన్ని క్షణాలే ఉన్నారని వెల్లడి
  • ఆయన వెళ్లిపోగానే అక్కడున్న వారు కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండానే వెళ్లిపోయారని వివరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఓ హోటల్‌లో బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయారట. ఇటీవల ఆయన మియామీలోని ఓ క్యూబన్ (క్యూబా దేశ వంటకాలు సర్వ్ చేసే..)రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తనను చూసేందుకు వచ్చిన వారికి తానే ఆహారం కొనిస్తానని మాటిచ్చారట. ఆ తరువాత బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయారని అక్కడున్న కొందరు తెలిపారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు. 

అయితే, ట్రంప్ వర్గం మాత్రం ఈ వార్తలను ఖండించింది. ట్రంప్ వెళ్లిపోయిన వెంటనే రెస్టారెంట్‌లోని వారు కూడా ఆహారం ఆర్డర్ చేయకుండానే వెళ్లిపోయారని ఆయన తరఫు ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే, వారు పార్సెల్ చేయించుకున్న ఆహారానికి ట్రంప్ బృందం బిల్లు కట్టిందని చెప్పారు. తనకు అద్భుత ఆతిథ్యమిచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారని అన్నారు. మరోమారు కచ్చితంగా ఆ రెస్టారెంట్‌ను సందర్శిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News