Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న

Will Suicide if congress wins in next elections says BRS Mla Jogu Ramanna
  • లేదంటే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్
  • తనను అవమానించిన రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారన్న బీఆర్ఎస్ నేత
వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. 

ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో రేవంత్ తనను అవమానించేలా మాట్లాడారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తనను లక్ష్యంగా చేసుకోవడం రేవంత్‌కు తగదన్నారు. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 8 స్థానాల్లో ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయిస్తారని జోగు రామన్న తేల్చి చెప్పారు.
Jogu Ramanna
Revanth Reddy
BRS
Congress
Adilabad District

More Telugu News